ఉద్యోగం చేస్తున్న దంపతులు పిల్లలు కనేందుకు ఇప్పుడేం తొందర కెరీర్ తో నిలదొక్కుకున్నాక పిల్లల సంగతి ఆలోచిద్దామని వాయిదా వేస్తూ వుంటారు. సంతాన సాఫల్యత గురించి సరైన అవగాహన లేదనే ఇలాంటి నిర్ణయాలు నవతరం దంపతులు తీసుకుంటున్నారంటున్నారు. డాక్టర్లు వాస్తవానికి 22 నుంచి 25 సంవత్సరాలు గర్భం ధరించటానికి స్త్రీలకు చాలా అనువైన సమయం. వయస్సు పెరిగే కొద్దీ సామర్ధ్యం తగ్గుతూ ఉంటుంది. కారణం స్త్రీలలో అండాల సంఖ్యా క్రమంగా తగ్గుతూ వస్తుంది. 35 దాటాక ఈ సామర్ధ్యం సగానికి సగం తగ్గుతూ వస్తుంది. పోనీ చికిత్స చేయించుకుంటే పిల్లలు పుడతారనే ధీమాతో ఉన్నా ఆ చికిత్సకు వయస్సే కీలకం. ఇవిఎఫ్ ఐ యూ ఐ వంటి చికిత్సలకు ముందు పరిగణలోకి తీసుకునేది వయస్సే . 35 దాటాక ఈ చికిత్సల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు సగం మాత్రమే. ఇక నలభై ల్లో అయితే ఈ అవకాశం ఐదు రేట్లు తగ్గిపోతుంది. వయస్సు 30 దాటితే మాత్రం ఇక ఆలస్యం చేయకపోవటమే మంచిది.
Categories