Categories
హాల్లో చక్కని తాజా పువ్వులను ఉంచండి,అవి కళ్ళకు ఎదురుగా కనబడుతూ ఉంటే,మాట్లాడే మాటల్లో కూడా సున్నితత్వం వస్తుంది అంటున్నారు మనస్థత్వ శాస్త్రవేత్తలు. గది గోడలు ఫర్నిచర్ ఏ రంగులో ఉన్నప్పటికీ,పువ్వులు తెల్లనివి అయితే మరింత లాభం అంటున్నారు. చక్కని గాజు పాత్రలో కొన్ని సముద్రపు రాళ్ళు ఉంచి పువ్వులు,ఆకులు కలగలిపిన ఫ్లోరల్ మిక్స్ డెకొరేషన్ చేస్తే ఆరంగులో వాటి తాజాదనం కళ్ళను కట్టిపడేస్తు సంభాషణలో కఠిన పదాలనురానివ్వదట.క్రుత్రిమమైన అలంకరణల కంటే ఈపువ్వుల డెకరేషన్ వల్ల ఒక ఆహ్లదకరమైన వాతావరణం కనిపిస్తు మనసు కయ్యానికి కాలు దువ్వనివ్వకుండా శాంతంగా ఉండమని ప్రేరేపిస్తు ఉంటుంది పువ్వుల పరిమళం శాంతిని ఇస్తూ ఒత్తిడిని తగ్గించటం వల్ల ఇలా జరుగుతుంది అంటున్నారు.