కెరీర్ మొదట్లోనే క్యూట్ ప్రేమ కథతో నటించడం పూర్తిగా యూత్ నేపథ్యంలో సినిమా చేయడం కాపీగా ఉంది. హుషారు సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేయాలో తెలీనంత సంతోషంగా ఉంది అంటుంది ప్రియా వడ్లమాని.అసలు నాకు దర్శకత్వం అంటే ఇష్టం ఆ ఇష్టంతో వంశీ పైడిపల్లి గారి దగ్గర మహర్షి సినిమా ప్రీ ప్రొడక్షన్ లో రెండు నెలలు పనిచేశాను. అప్పుడే హుషారు,శుభలేఖలు సినిమా అవకాశాలు వచ్చాయి. దింతో ఇటు వచ్చేశా అంటుంది. నేను క్లాసికల్ డ్యాన్సర్ ని అంటుంది ఈ తెలుగమ్మాయి. పన్నెండు సంవత్సరాలు శాస్త్రియ నృత్యం నేర్చుకున్నా అలా స్టేజ్ ఫియర్ లేదు. నటీంచడం సులువుగా అలవాటైంది.అయినా నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి. హుషారు సినిమాతో అంటుంది ప్రియా వడ్లమాని.