బ్లఫ్ మాస్టర్ తో ప్రేక్షకులను పలకరించింది నందితాశ్వేత. తెలుగులో కనిపించలేదు గాని క్రితం సంవత్సరం పదకొండు సినిమాలు చేశాను. కొన్ని ఈ ఏడాది విడుదల అవుతాయి. నాకు గ్లామర్ పాత్ర కంటే నటనకు ప్రాధాన్యాత ఉన్న పాత్ర ఇష్టం.కంటెంట్ ఉన్న పాత్రలు చేయాలనుకుంటాను.బేసిక్ గా హర్రర్ సినిమాలు కూడా ఇష్టం. అవకాశం వస్తే దడిపించేస్తా అంటుంది నందిత. భవిష్యత్ లో చేయవల్సిన పనుల లిస్ట్ లో ఇప్పుడు ఎంబీఏ అయిపోంది కదా ఇక పీహెచ్ డీ చేయాలి. డాక్టర్ నందితా శ్వేత అనిపించుకోవలన్నది నా కోరిక అంటుంది. అలాగే సినిమాల్లో ఎక్స్ పోజింగ్,లిప్ లాక్ లు వంటి వాటికి నేనయితే చాలా దూరం గ్లామర్ పేరుతో అసభ్య సన్నివేశాలు చేయను అంటుంది నందితా.

Leave a comment