నీహారికా ,
ఇవ్వాళ నువ్వు చెప్పిన కబురు చాలా అవసరం అయినది ఆలోచించి జాగ్రత్తగా వుండవలిసిందీ నా ఫ్రెండ్ కాస్త బొద్దుగా ఉంటుంది తనను టీజ్ చేస్తే నవ్వేస్తోంది కానీ చాలా కుంగిపోతుంది. కానీ అలా అనద్దని మిగతా ఫ్రెండ్స్ తో ఎలా చెప్పాలి అన్నావు కరెక్టే. చాలా ఇబ్బంది. సన్నిహితులే కదా అని బొద్దుగా బరువుగా ఉండేవారని సరదాగా చనువుగా ఆటపట్టిస్తూ వుంటాను. వాళ్ళ గురించి ఏవో వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళు కూడా సరదాగా తీసుకుంటారు అనుకుంటారు. కానీఇలాంటి నవ్వులాటలు ఎగతాళి వారిని శారీరికంగా మానసికంగా దెబ్బ తీస్తున్నట్లు కొన్ని అధ్యయనాల్లో రుజువైంది. అధికంగా బరువు ఉన్నామనే భావం ఒక్కసారి డిప్రెషన్ కు గురిచేస్తుందిట పదే పదే లావుగా ఉన్నావంటూ వ్యాఖ్యానిస్తుంటే సన్నబడే ప్రయత్నాలు చేసి చాలా అనారోగ్యాలపాలవుతుంటారని భావం. ఎందుకంటే బరువు పెరగటానికి బోలెడంత ఆహారం తినటం కారణం ఒక్కటే కాదు హార్మోన్స్ కారణం కూడా అవ్వచ్చు. జీన్స్ లో ఉండచ్చు . ఏదైనా కావచ్చు కానీ సరదాకైనా సాటి స్నేహితులను అలా వేధించి ఆనందించే ప్రయత్నం చేయటం అనాగరికం . అలంటి అలవాటున్న స్నేహితులతో కఠువుగానైనా సరే ఇతరులను అవమానించి బాధపెట్టవద్దని హెచ్చరిస్తేనీ మంచిదనిపిస్తోంది. తప్పులు ఎవరైనా చేస్తారు. అది తప్పని సక్రమంగా చెపితే అర్ధం చేసుకునే సంస్కారం వుంటుందనే ఆశిద్దాం .