Categories
భారతీయ మహిళల సంప్రదాయ చీరెకట్టు ప్రత్యేకతను చెపుతూ ,ఆ అందమైన చీరెలను వేసే చేనేత కళాకారుల సాయ పడేందుకుగాను వినీ టండన్ శారీ స్పీక్ గ్రూప్ ను ఫేస్ బుక్ లో మొదలు పెట్టారు . సభ్యుల సంఖ్య చాల తొందర లోనే లక్ష దాటింది . ఇందులో 18 ఏళ్లు నిండిన వాళ్ళ దగ్గర నుంచి అరవై ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారు . అందరు చక్కని చీరెకట్టు గురించి . తమ ప్రాంతపు జీవన విధానం గురించి . సంస్కృతి ,సంప్రదాయాల గురించి ఈ పేస్ బుక్ శారీ స్పీక్ పేజ్ లో రాస్తుంటారు . ఇలాటి గ్రూప్ లు ఒక లక్ష్యం కోసం ప్రారంభమైనవి గానుగ సక్సెస్ అవుతాయి . మొన్నామద్యను హైదరాబాద్ లో ఈ గ్రూప్ పెస్టివల్ జరిగింది .