ఎన్ని ఆధునికమైన డిజైనర్ ,ఫ్యాషన్ డ్రెస్ లు వచ్చిన చీరెకట్టులో ఉండే అందం దేనిలోనూ ఉండ .చీరె శరీరానికి అనుకూలంగా ఉంటుంది.ఇందులో ఎక్కువ ప్రయోగాలు ఉండవు గానీ వెళ్ళే సందర్భాన్ని బట్టి చక్కని చీరెని ఎంపిక చేసుకోవాలి. దానికి సరైన బ్లౌజ్ ఉండాలి. సందర్భానికి తగిన నగలూ ఉండాలి. సాధారణంగా ఆఫీస్ కు వెళ్ళేందుకు అయితే లినెన్,జరీకోటా,చేనేతలు చాలా బావుంటాయి.చక్కని కాలర్ నెక్ బ్లౌజ్,ఏమాత్రం ముడతలు లేకుండా ఇస్త్రీ చేసిన ఏ సాధారణ కాటన్ చీరె అయినా హుందాగానే ఉంటాయి.చీరె ముఖ్యంగా నలిగి వేలాడినట్లు కాకుండా చక్కగా ఇస్త్రీ చేసి ఉండాలి. సిల్క్ లో అయినా సరే చక్కని డిజైనర్ శారీస్ ను కుచ్చిళ్ళు అందంగా పేర్చుకొని పిన్ను పెట్టుకుంటే సాయంత్రం వరకు చెదిరిపోకుండా ఉంటాయి. చీరెలు పెద్ద అంచులు వస్తే మెడదగ్గర ట్రాబ్ లాంటివి బావుంటుంది. చీరె పల్చగా ఉంటే కొంగు జార విడిస్తే బావుండదు. బ్లౌజ్ క్లోడ్ నెక్ ఉండాలి.
Categories