శరీరం సౌష్ఠవంతో ,యవ్వనంతో ఉండాలని చక్కని వ్యాయామాలు చేస్తారు. కానీ ఈ నడక ,పరుగెత్తటం వల్ల మోకాళ్ళకు హాని జరిగి త్వరగా ఆస్టియో ఆర్థరైటిన్ వస్తుందని చాలా మంది భయపడుతారు.పరుగులు తీసే వారిలో ఆర్థరైటిస్ అవకాశాలు ఎక్కువ అనేందుకు ఆధారాలు ఏమీ లేవు. నిజానికి పరుగెత్తటం వల్లనే కార్టిలేజ్ ఆరోగ్యంగా ఉంటుంది.దీని వల్ల మోకాళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.ధృఢమైన కండరాలు లిగమెంట్లకు రన్నింగ్ తోడ్పడుతోంది. సరైన పాద రక్షలు లేకుండా పరుగెత్తటం వల్ల మోకాలికి హాని జరుగుతోంది. పరుగెత్తే సమయంలో ఒత్తిడిని తట్టుకోగల సహజ గుణం మోకాళ్ళకు ఉంటుంది. రోజుకు అరగంట రన్నింగ్ తో మంచి ఫలితాలు ఉంటాయి.

Leave a comment