Categories
కళ్ళకు కనిపించని భగవంతుడిని కొన్ని రుజువులు నమ్మమంటూ ఉంటాయి. అలాటి వాటిల్లో హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా లో ఉన్న జ్వాలాముఖి ఆలయం ఒకటి. ఈ ఆలయం గర్భగుడిలో రెండు రాళ్ళ మధ్య ఉన్న దీపం వంద సంవత్సరాలుగా వెలుగుతూనే ఉంది. భక్తులు దీన్ని దైవ లీలగా భావిస్తారు. ఆ ఆలయన్ని దర్శించు కొనేందుకు పోటెత్తుతారు. కానీ శాస్రవేత్తలు దాన్ని పరిశీలించి అక్కడ మీథేన్ వంటి నేచురల్ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి ,అందుకే ఈ జ్వాల నిరంతరాయంగా మండుతూ వుంటుందని చెపుతున్నారు.