Categories
కప్పుకాఫీ తోనే తెల్లవారుతోంది ఈ ప్రపంచంలో సగం జనాభాకి ,ఒట్టిగా తాగేందుకే కాదు ఈ కాఫీపొడి చక్కని స్క్రబ్ .దీనితో7 చర్మం మృదువుగా అందంగా అయిపోతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కాఫీ పొడి ,చక్కెర ,ఆలివ్ నూనె ,విటమిన్ ఇ మాత్రల నూనె కలిపి ఒళ్లంతా పట్టించి మర్ధన చేస్తే మృతకణాలు పోతాయి. ఓ పావుగంట అలా వదిలేసి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే చర్మం ఎంతో కాంతి వంతంగా మృదువుగా ఉంటుంది. ఇందులో ఏ రసాయనాలు కలుప కుండా ఇంట్లోనే తయారు చేస్తాం కనుక చర్మానికి జరిగే హాని లేదు. వారంలో రెండుసార్లు ఈ స్క్రబ్ తో స్నానం చేస్తే చర్మం చక్కగా ఉంటుంది.