ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన బిలియనీర్ల జాబితాలో అత్యంత ధనవంతురాలైన మహిళగా సావిత్రీ జిందాల్‌ గుర్తింపు పొందారు.ఆమె ఆస్తి విలువ 50 వేల కోట్ల రూపాయలు వయస్సు 70. ఎంపికైన ఐదుగురు మహిళా ధనవంతుల్లో మొదటి స్థానం సావిత్రీ జిందాల్‌ కు దక్కింది. ఆమె భర్త ఒ.పి జిందాల్‌, జిందాల్‌ గ్రూప్‌ సంస్థల స్థాపకుడు.మల్టీ బిలియన్ డాలర్ల విలువ చేసే మిశ్రమ వ్యాపార సంస్థల అధిపతిగా సావిత్రీ జిందాల్‌ వ్యవహరిస్తున్నారు.2005 లో హెలీకాప్టర్ ప్రమాదంలో భర్త మరణించటంతో సంస్థకు అధిపతిగా సావిత్రీ వ్యాపార బాధ్యతలు చేపట్టారు.

Leave a comment