మెట్లు ఎక్కటం ,ఏ మాత్రం ఖర్చు లేని వ్యాయామం. 35ఏళ్ళ వయసు వచ్చే వరకు మెట్లెక్కి దిగటం తమ వ్యాయామం లో భాగంగా చేసుకొంటే ఆ తరువాత ఇబ్బంది లేకుండా మోకాళ్ళ కీళ్ళు సహాకరిస్తాయి. కాస్త వయసు పెరగుతున్నాకొద్దీ ఎక్కే సమయంలో ఒత్తిడి మోకాళ్ళపై పడుతోంది. ఈ మెట్లెక్కి దిగటం గుండెకు మేలు చేస్తుంది కానీ మోకాళ్ళ పై వత్తిడి పెరుగుతోంది. శరీరక బరువు ఏదో ఒక మోకాలిపై పడుతోంది. అందుకే వారంలో ఒక రోజు మెట్లెక్కటం వ్యాయామంలో భాగంగా చేసుకొవచ్చు. కానీ ఎక్కువగా వద్దు. ఇది మంచి కార్డియో ఎక్సర్ సైజ్. ఊపిరితిత్తులకు మంచిది. కానీ ఈ మెట్లెక్కటంతో శరీరం ఇచ్చే హెచ్చరిక వినాలి. ఏ కారణం చేతనైనా నొప్పి అనిపిస్తే వెంటనే మానేయాలి.

Leave a comment