Categories
చలి వాతావరణం,దోమల కారణంగానే వైరల్,ఫ్లూ జ్వరాలు పట్టుకొంటాయి.రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆహారం ద్వారానే ఈ వ్యవస్థ బలపడుతుంది.విటమిన్ సి అధికంగా ఉండే కమలాపండులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండి ఈ వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఇన్ ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. ఆకుపచ్చని కూరగాయల్లో రోగ నిరోధక శక్తి పెంచే గుణాలు ఎక్కువ. ముఖ్యంగా వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్దం బాక్టీరియా నుంచి శరీరాన్ని కాపాడుతుంది. అలాగే లవంగాలు కూడా ఆహారంలో ఉపయోగించాలి. వేప ,తులసి ఆకులు కూడా కడిగి తింటూ ఉంటే లాభమే .పెరుగులో కూడా బాక్టీరియాపై పోరాడే గుణం ఉంటుంది.