Categories
బాత్రూమ్స్ శుభ్రంగా ఉంచుకునేందుకు వాడే లిక్విడ్ ఎంతో ఘాటైన వాసన తో ఉంటాయి. ఆ రసాయనాలు వాడితే తల తిరుగుతుంది. సహజమైన వాటితో స్నానాల గది శుభ్రంగా ఉంచుకోవచ్చు. కప్పు వెనిగర్ కి అరకప్పు బేకింగ్ సోడా రెండు స్పూన్ల నిమ్మరసం,కాస్త లిక్విడ్ డిష్ వాష్ కలిపి బాత్రూం లో, సింక్ ల్లో ట్యాపుల పైన పోసి కాసేపు అలా వదిలేసి తర్వాత రుద్ది కడిగితే పసుపు రంగు మరకలు కూడా మాయం అవుతాయి. ఈ మిశ్రమానికి రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలిపితే స్నానాల గది మంచి వాసన వస్తూ ఉంటుంది.