Categories
లివింగ్ రూమ్ గురించి కాస్త శ్రద్ధ పెడితే ఇల్లు అందం బయట పడుతుంది. ఇందులో ఎంత తక్కువ సామాను వుంటే అంత మంచిది. పాతవి, అనవసరం లేవనుకొన్నవి తీసి పారేయాలి. గది సింపుల్ గా సోఫిస్టికేటెడ్ గా వుండాలి. ఫ్రీ స్టాండింగ్ బుక్ షెఫ్స్ పెయింటింగ్స్, సీలింగ్స్ వంటివి సృజనాత్మకంగా తయ్యారు చేయిన్చుకోవాలి. గదిలో వాడె రంగులు గది రూపాన్నే కాదు మూడ్ ని కూడా ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోవాలి. ఫర్నిచర్ కాస్త అటు మార్చినా తేడా తలుస్తుంది. లైట్లతో కూడా ప్రయోగాలు చేయొచ్చు. లివింగ్ రూమ్ లో ఆర్టిఫిషియల్ సహజ కాంతులు రెండింటినీ మిళితం చేయొచ్చు. లైటింగ్ వల్ల చిన్న గదులు పెద్దగా కనిపిస్తాయి. గది శుబ్రంగా కర్టిన్లు కొత్తవిగా వున్న వస్తువులు ఆధునికంగా కనిపించాలి.