వాతావరణం లోని చల్లదనానికి పెదవులు పొడిబారిపోతాయి. పెదవుల పోషణ పై శ్రద్ధ తీసుకోవాలి. పొడిబారకుండా మాయిశ్చరైజ్  చేయాలి. కొన్ని లిప్ స్టిక్ లో మాయిశ్చరైజర్ లుగా ఉపయోగపడతాయి. లేదా లిప్ స్లీపింగ్ మాస్క్ వేసుకోవాలి. ఇది పెదవులను మెరిసేలా చేస్తుంది. లిప్ స్టిక్, లిప్ బామ్, లిప్ లైనర్ లు ఏవి అతిగా పనికిరావు. టిష్యూ తో అద్ది ఎక్కువైన దాన్ని తొలగించాలి. పెదవులు పగిలి నట్టు అనిపిస్తే ముందుగా లిప్ స్క్రబ్ తో పెదవులు మృదువుగా రబ్ చేయాలి. తర్వాత పెదవులపై వ్యాజిలైన్ రాశి బ్రష్ తో నిదానంగా రుద్దితే పొడిబారిన చర్మం తొలగి పోతుంది. తర్వాత లిప్ స్టిక్ ఉపయోగిస్తే పెదవులు చక్కగా ఉంటాయి.

Leave a comment