Categories
బియ్యం కడిగిన నీళ్ళతో ఎన్నో సౌందర్య ప్రయోజనాలున్నాయి. చర్మానికి ,వెంట్రుకలకు పోషణ ఇచ్చే పోషకాలు ఈ బియ్యం కడిగిన నీళ్ళలో పుష్కలంగా ఉంటాయి. బియ్యం నీళ్ళను వెంట్రుకలకు పట్టిస్తే జుట్టు కుదుళ్లు గట్టిగా అవుతాయి.జుట్టు మెరుస్తూ ఉంటుంది. ఈ నీళ్ళను మొహానికి పట్టిస్తే చర్మరంధ్రాలు ముడుచుకుని చర్మం బిగుతుగా అయిపోతుంది. మొటిమల కారణంగా ఎర్రబడిన చర్మం మామూలుగా అయిపోతుంది. బియ్యం నీళ్ళలోని పోషకాల వల్ల చర్మం జీవంతో మెరుస్తుంది, నునుపుగా ఆరోగ్యంగా మారుతోంది . చర్మంపైన ఎండకు వచ్చిన దద్దుల మంటలు తగ్గాతాయి. ఎండకు కమిలిపోయినా చర్మం మామూలుగా అయిపోతోంది.