బొటానికల్ సైన్స్ లో డాక్టరేట్ చేసిన తొలి మహిళ గా జానకి చరిత్ర సృష్టించింది.కేరళలోని తలస్సేరి లో 1897 లో జన్మించిన జానికి అమ్మాళ్ అమెరికా కు చెందిన ప్రతిష్టాత్మక ‘యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్’ స్కాలర్ షిప్ కు ఎంపిక అయ్యారు.అమెరికా లో చదువుకున్నారు చెరుకు మొక్కల జీవ పరిణామ క్రమం పై ఆమె రాసిన క్రోమోజోమ్ అట్లాస్ ఆఫ్ కల్టివేటెడ్ ప్లాంట్స్ ఒక ప్రామాణిక పుస్తకం. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (కోల్ కతా) కు ప్రత్యేక అధికారినిగా సేవలు అందించారు జానకి అమ్మాళ్. పద్మశ్రీ తో గౌరవించింది ప్రభుత్వం.

Leave a comment