అమ్మా!! వరలక్ష్మి వేగ రమ్మా.. 

మా ఇంటికిపుడే…అమ్మా వరలక్ష్మి వేగ రావమ్మా!!

 

సఖులారా!!అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరూ పూజ చేసుకుని ముతైదువులకు తాంబూలం ఇచ్చి నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారా!! కైలాసంలో శివపార్వతుల సంభాషణ విందామా..రండి!!
పూర్వం చారుమతి అనే యువతి తన భర్త,అత్త మామలకు తు.చ.తప్పకుండా సేవలు చేసి వారి మన్ననలు పొందింది.అది గమనించిన లక్ష్మి దేవి చారుమతికి స్వప్నంలో కనిపించి అభినందనలు చెప్పి వచ్చే శ్రావణ మాసంలో శుక్లపక్షము నందు పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మిగా తనకు పూజలు చేయమని చెప్పి నిష్క్రమించింది.చారుమతి సంతోషంగా ముతైదువులతో సమిష్టిగా వరలక్ష్మి వ్రతం చేసి,మొదటి ప్రదక్షిణం చేస్తూ వనితల కాళ్ళకి గజ్జెలు వచ్చాయి,రెండవ ప్రదక్షిణం చేస్తూ వనితల చేతులకు బంగారు గాజులు,మూడవ ప్రదక్షిణం చేస్తూ వనితల మెడలో కాంచన హారములతో అలంకారం చూసి భక్తులు సంతోషంగా వరలక్ష్మి దేవికీ మనస్పూర్తిగా నమస్కరించారు.
ఈ వ్రతం చేయడం ఒక ఆచారం.క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జరుపుకున్న వరలక్ష్మి దేవి తప్పకుండా ఆశీస్సులుఅందుకోవడం గమనార్హం.

ఇష్టమైన పూలు: అన్ని రంగుల పూలు సమర్పించిన ఆనందంగా కటాక్షం.

ఇష్టమైన రంగులు: అన్ని రంగులు.నలుపు అనివార్యం.

ఇష్టమైన పూజ:తొమ్మిది సూత్రాలతో తోరణం కట్టుకొని శ్రద్ధగా వ్రతం   చేయడం.ముతైదువులకు తాంబూలం ఇవ్వడం.

నిత్య ప్రసాదం: కొబ్బరి, అన్ని రకాల పండ్లు,
పానకం,వడపప్పు,పొంగలి,గారెలు,పాయసం,
దద్ధోజనం మొదలగు వాటిని నైవేద్యం పెట్టుకోవాలి.

 

-తోలేటి వెంకట  శిరీష

Leave a comment