వరంగల్ అంటే భద్రకాళి గుర్తు వస్తుంది కదా!!

భద్రకాళి అనే పదంలో మహాకాళి అమ్మవారు మనలను భద్రంగా కాపాడుతుంది అని పేరులోనే ఉంది.భద్రకాళి ఆలయం చోళ, కాకతీయ ప్రభువులు నాటిది.రాణి రుద్రమ దేవి అమ్మవారి దర్శనం,ప్రసాదం స్వికరించేవారట.
ఈ ప్రదేశంలో శ్రీ రాముడు సీతాన్వేషణలో  పర్యటించారు.హనుమంతుడు ఇక్కడ రామ నామం జపించేవాడు అందుకే హనుమకొండ అని పేరు.చోళ రాజులు-నవాబుల పరిపాలనలో  అమ్మవారి ఆలయం శిధిలావస్ధకు గురి అయింది. కాకతీయుల కాలంలో అమ్మవారికి శోభ కలిగి తొమ్మిది అడుగుల ఎత్తు,తొమ్మిది అడుగుల వెడల్పు తో దేదీప్యమానంగా ఉంది.
  శంకర జయంతి రోజు భద్రకాళి అమ్మవారి
జన్మ నక్షత్రం రోజు.ఈ రోజు కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది.నిత్యం ఉత్సవాలతో విరాజిల్లుతూ భక్తులకు సంతోషాన్ని కలిగించి, చల్లని చూపులు తల్లి ఆశీస్సులు అందుకోవడం మన అదృష్టం.

ఇష్టమైన రంగులు:ఎరుపు, ఆకు పచ్చ
ఇష్టమైన పూలు: చామంతులు
ఇష్టమైన పూజలు:నిమ్మకాయ దండలు సమర్పించడం.
నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు.

 

-తోలేటి వెంకట శిరీష

Leave a comment