ఆషాఢమాసంలో గ్రామదేవతలకు పూజలు ప్రత్యేకంగా చేస్తారు.

హైదరాబాద్ లో ఉన్న “బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి” గురించి చెప్పుకోవాలి.ఈ తల్లి స్వయంభూ గా బావిలో వెలిసింది.భక్తులు ఎల్లమ్మ తల్లికి బావిలో నుంచే పూజించి కటాక్షం పొందేవారు.
జమదగ్ని మహర్షి భార్య అయిన రేణుక ఎల్లమ్మ పరశురాముడికి తల్లి. పార్వతి దేవి అంశం. ఆషాఢమాసం తొలి మంగళవారం ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది.ఇక్కడ నిత్యం బోనాలు సమర్పించుకుంటారు భక్తులు.
రేణుక ఎల్లమ్మ తల్లి తల మీద నుంచి నిత్యం జలం ప్రవహిస్తుంది. ఈ జలంతో స్నానం చేసిన వివిధ రకాల చర్మ వ్యాధులు నయమవుతాయి.ప్రతి పర్వదినాలలో అన్నదానం చేస్తారు.

       ఇష్టమైన పూలు: బంతి,చామంతి,రోజా పువ్వులు.
        ఇష్టమైన రంగు:  ఎరుపు.
        ఇష్టమైన పూజలు: మేక,పొట్టేలు,సమర్పించుకోవటం.
         నిత్య ప్రసాదం: కొబ్బరి, నిమ్మకాయ దండ.

 

 

         – తోలేటి వెంకట శిరీష

Leave a comment