ఓం నారాయణాయ….
విజయవాడలో కృష్ణానది తీరాన వెలసిన మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శించి వద్దాం పదండి!!
భరద్వాజ మహర్షి కృష్ణానది ఒడ్డున తపస్సు చేస్తున్న సమయంలో నరసింహస్వామి ప్రత్యక్ష మైనాడు.ఆనాటి నుండి మహర్షి స్వామికి పూజలు క్రమం తప్పకుండా నిష్ఠగా చేసేవారు.తంగేడు గ్రామానికీ ప్రభువు అయిన మాచిరెడ్డి కలలో నరసింహస్వామి ప్రత్యక్ష మై తను ఒక గుహలో ఉన్నానని తన ఆనవాళ్ళు చెప్పి అదృశ్యం అయ్యాడు.వెంటనే మాచిరెడ్డి గుహలో స్వయంభుగా వెలసిన ఆ దేవునికి పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు.
రాజ్యలక్ష్మీ సమేతుడై నరసింహ స్వామి భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే స్వరూపుడు.పచ్చని చెట్లు,కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పుణ్య క్షేత్రం వుంది.
ఇష్టమైన పూలు: ఎరుపు రంగులో ఉన్న పూలు సమర్పించిన ఆనందంగా కటాక్షం
నిత్య ప్రసాదం:కొబ్బరి,పండ్లు,పులిహోర, శనగ గుగ్గిళ్లు.
-తోలేటి వెంకట శిరీష