న్యూయర్క్ లో ని గట్మాకర్ ఇనిస్టిట్యూట్ ,ముంభైలోని ఇంటర్నేషనల్  ఇన్ స్టిట్యూట్ ఆ ఫ్ పాపులేషన్ సైన్సెస్ కలిసి నిర్వహించిన ఓ అధ్యయనంలో మహిళల విషయంలో ఒక ప్రమాదమైన అంశం బయటపడింది. ఇండియాలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ లో 83 శాతం మంది, తమిళనాడులో 63శాతం మంది మహిళలు తమ అవాంచిత గర్భాన్ని పోగోట్టుకోవటానికి డాక్టర్ల అనుమతి లేకుండా సొంతంగా ఫార్మాసీలకు వెళ్ళి అబార్షన్ పిల్స్ కొని తెచ్చుకొంటున్నట్లు తేలింది. అస్సాం,బీహర్ ,గుజరాత్,మధ్యప్రదేశ్ లలో నిర్వహించిన అవాంఛిత గర్భం,గర్భవిచ్చిత్తి మాత్రలు వాడకంపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైయింది. ప్రమాదకరమైన ఈ ధోరిణి వివారించేందుకు ప్రభుత్వం సురక్షితమైన విధానాలను మహిళలకు అందుబాటులోకి తేవాలని అధ్యయనకారలు సూచిస్తున్నారు.

Leave a comment