తెలంగాణా    రాష్ట్రం,ఏదులాబాద్,ఘట్కేసర్ గల గోదా సమేత శ్రీ రంగనాథస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని మోక్షం పొందడానికి వెళ్దామా!!

విష్ణుచిత్తుడనే భక్తుడికి విష్ణు మూర్తికి రోజు తులసి మాలలు సమర్పించటం ఆనందం.ఒకరోజు తులసి వనంలో  అపరంజి బొమ్మ దొరికింది. గోదై అని నామకరణం చేసి విష్ణు భక్తురాలుగా అల్లారు ముద్దుగా పెంచారు.ఒకరోజు స్వామివారికి మాలలు సమర్పించుట ఆలస్యం అయ్యిందని విష్ణుచిత్తునకు ఆందోళనగా వున్న గోదై తల్లిని చూచిన మాలలు ముందుగా తను మెడలో ధరిస్తున్నది.ఆమె భక్తికి మెచ్చి శ్రీ రంగనాథస్వామి తనలో ఐక్యం చేసుకుని మనకు “గోదా సమేత శ్రీ రంగనాథస్వామిగా”
దర్శనం ఇస్తున్నారు.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పులిహోర, దద్ధోజనం

-తోలేటి వెంకట శిరీష

Leave a comment