పెళ్లి వేడుక పూర్తికాగానే వధూవరులు వరుడి ఇంటికి వెళ్తారు అది సాంప్రదాయం కొత్త కోడలి రాకతో ఆ ఇంట్లో ఒక పండుగ వాతావరణం ఉంటుంది. కానీ ఉత్తర ప్రదేశ్ లోని కౌశాంచి జిల్లా లోని అమ్ని లోకి పూర్ లో ఒక పెళ్లి జంట ఊరు లోకి అడుగుపెడితే ఊరంతా పండగ. ఆ పెళ్లి జంట అక్కడ ఒక మొక్క నాటితే గాని అత్తారింట్లో అడుగు పెట్టనివ్వరు పైగా ఆ మొక్క పెరిగే వరకు దాని సంరక్షణ బాధ్యత మొత్తం ఆ దంపతులుదే 3,700 మంది జనాభాలో తో ఉండే గ్రామం లో కొత్తగా పెట్టుకున్న వింత అలవాటు ఇది. గతంలో గ్రామం మొత్తం పచ్చని చెట్లు ఉండేవి ఇల్లు, పొలాలు పెరిగిపోయి చెట్టు కాస్త తగ్గిపోయాయి. ఒకవేళ ఎవరైనా ఓ మొక్క నాటిన దాన్ని ఎవరూ పట్టించుకోక ఎండి పోయేది. అప్పుడిక మా ఊరి ప్రజలు అందరూ కలిసి ఈ కట్టుబాటు మొదలుపెట్టారు మొక్కలను నాటాలి దాని బాగోగులు చూడాలి దాన్ని ఒక కర్తవ్యంగా పాటిస్తే గాని మొక్క నిలవదు అనుకొన్నారు .ఈ బాధ్యత కొత్తగా పెళ్లయిన దంపతులు పైన పెట్టారు పచ్చని చెట్ల కోసం వూరి ప్రజలు చేసిన చక్కని ఆలోచన చాలా అద్భుతంగా ఉంది కదూ !
Categories