లాక్ డౌన్ లో అందరూ ఇంట్లోనే ఉండటం వర్క్ ఫ్రమ్ హోమ్ లు ఇంట్లో పని ఒత్తిడి పెరిగి చాలా మంది ఆడవాళ్ళలో మతిమరుపు మాట వినిపిస్తోంది. ఇది కొంచెం శ్రద్ధ తీసుకోవలసిన అంశం అంటున్నారు ఎక్సపర్ట్స్. సరిగ్గా నిద్ర లేకపోవటం అంతులేని చాకిరి తో మెదడు పై ఒత్తిడి వల్ల తాత్కాలిక  మతిమరపు రావచ్చు అంటున్నారు.అందుకే ముందుగా కొన్ని చిట్కాలు పాటించాలి ప్రతి చిన్న విషయం రాసి పెట్టుకోవాలి. నిద్రపోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.ఇది మెదడుకు రక్తప్రసరణ సరిగ్గా జరగడం లో సహాయం చేస్తుంది.శక్తికి మించిన పనులు పెట్టుకోవద్దు ఎంతవరకు చేయగలరో అంతే చేయాలి. మతిమరపు కు ఒత్తిడే కారణం అంటున్నారు ఎక్సపర్ట్స్.

Leave a comment