Categories
వారంలో కనీసం రెండు సార్లు చేపలు తినే వాళ్ళలో స్ట్రోక్ రిస్క్ చాలా తక్కువ ఉంటుందని చెపుతున్నారు నిఫుణులు. ఒమేగా-3 సప్లిమెంట్స్ అన్న పదం ఇప్పటికే చాలా సార్లు విన్నాం .అయితే ఈ సప్లిమెంట్స్ కంటే అసలైన చేపల్లోనే ఎంతో శక్తి ఉంటుందంటున్నారు. చేపల్లో ఉండే విస్తృతస్థాయి పోషకాల అంతర్గత పని తీరుతో స్ట్రోక్ రిస్క్ ఎక్కువశాతం దగ్గరకు రాదంటున్నారు. సప్లిమెంట్స్ లో కూడా ఎంతో శక్తి ఉన్న మాట నిజమే కానీ తరుచూ చేపలు తింటే ఈ సప్లిమెంట్స్ అవసరం రాదంటున్నారు. ఉదయాన్నే లేవగానే యాంటీ ఆక్సిడెంట్లు ,మెగ్నిషియం,పోటాషియం వంటి ఖనిజాలు ,ఒమేగా ఫ్యాట్ ఉండే బాదం , వేరు శనగ గింజలు అలాగే వారంలో రెండు సార్లు చేపలు తింటే మరణాల రేటు తక్కువని అధ్యయనం చెపుతుంది.