ఎందరో హాలీవుడ్ సెలబ్రెటీలు ఐర్లాండ్ లోని బ్లార్నీ బురుజు లో ఉన్న అదృష్ట రాయి కి ముద్దు పెట్టి సంతోష పడడం ఐర్లాండ్ వాసులు ఈ కోటలోని బురుజు నిర్మాణంలో శాశ్వతంగా ఒక గోడలు నిలిచిపోయిన బ్లార్నీ రాయిలో అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్ముతారు శతాబ్దాల క్రితం స్కాట్లాండ్ ఇంగ్లాండ్ రాజులు ఈ రాయిని తమ పట్టాభిషేక ఉత్సవాల్లో తప్పనిసరిగా ఉండేలా చూసుకునేవారట.ఆ చేతులు మారుతూ ఆ ప్రాంతాన్ని పరిపాలించే మెక్ కార్టి చేతికి వచ్చింది.. దాన్ని ఆయన బురుజు కోట గోడలో శాశ్వతంగా ఉంచేశాడు. ఆ బ్లార్నీ కోట లోని రాయి వయసు 330 మిలియన్ సంవత్సరాల పైమాటే అని నిర్ధారించారు చరిత్ర కారులు హోలీడ్ స్పాట్ గా బ్లార్నీకోట ప్రసిద్ధి చెందింది. బురుజు పై భాగం లో ఉన్న ఈ రాయిని వచ్చిన ప్రతి వాళ్ళూ ముద్దాడి వెళతారు.

Leave a comment