Categories
శరీరానికి కావలసిన పోషకాలు తినే ఆహారం ద్వారానే భర్తీ అవుతాయి. ఒక్క ‘డి’ విటమిన్ తప్ప మిగతా అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్లు మనం తినే ఆహారంలోనే లభిస్తాయి. సప్లి మెంట్లు సహజ సిద్ధంగా లభించే కాల్షియం కంటే మెరుగైన ఫలితాలు ఇవ్వటం లేదంటాయి పరిశోధనాలు. ఒక పద్ధతి లేకుండా విటమిన్లు , మినరల్స్ సప్లి మెంట్స్ రూపంలో తీసుకొంటుంటే కాలేయం దెబ్బతింటుందంటున్నారు. మానసిక స్థితిలోనూ మార్పులు రావచ్చు. జుట్టు ఊడి పోయి చర్మం పొడిబారిపోవచ్చును. పోషకాహార లోపం ఏర్పడినప్పుడు వైద్య పరంగా అవసరం అయితేనూ, ఆహారం ద్వారా భర్తీ చేసుకొనే అవకాశం లేనప్పుడు విటమిన్ మాత్రలు వాడాలి. ఆరోగ్యవంతమైన దేహం సమతుల్యమైన ఆహారం ద్వారానే సాధ్యం.