Categories
మనిషి శరీరంలో ఖనిజాలు,ద్రవాలు ,విటమిన్లు అన్నింటిలో సమతుల్యం ఉంటేనే ఆరోగ్యం. అన్నింటితో పాటు సూర్యరశ్మి కూడా అవసరం అంటారు నిఫుణులు. ఇప్పుడున్న పరిస్థుల్లో సూర్యుని వెలుగు చూసే అవకాశం లేకుండా జీవనవిధానం ఉంటోంది. ఉదయం నుంచి ఉరుకు పరుగులు ,కార్లో ప్రయాణాలు, ఆఫీస్ లో ఎ.సి లో ఇక సూర్యకాంతి ఎక్కడ. ఇదే పద్దతి కొనసాగితే కాళ్ళు ,కీళ్ళ నొప్పులు రావటం ఖాయం. విటమిన్ డి లభించేది ఎండవల్లనే అంటారు కానీ ఎంతసేపు ఎండలో అని ఒక నిర్ధిష్టమైన గీత ఏదీ లేదు. అయినా శరీరానికి సన్ స్క్రీన్ అప్లైయ్ చేసి ,ఓ అరగంట లేదా పావుగంట అయినా ఎండలో నిలబడితేనే మంచిది .అదే విటమిన్ డి అందుతోంది. శరీరం,చర్మం , ఆరోగ్యం బావుంటుంది. అందుకే సూర్యకాంతికి దూరం కావద్దు అంటున్నారు వైద్యులు.