సస్పెండెడ్ మీల్స్,’సస్పెండెడ్ కాఫీ’ ఈ సంప్రదయం టర్కీ లో కొన్ని వందల ఏళ్ళ నుంచే వుంది. బటోమిన్ పాలనలో ఇది మొదలైందని చెపుతారు. పేద్దవాళ్ళకు రొట్టెలు దానం ఇచ్చేందుకు ఇది మొదలైంది. ఈ సస్పెండెడ్ విధానాన్ని ఇటలీలోని కాఫీ షాపులు అందిపుచ్చుకొన్నాయి. ఒక కాఫీ తాగాలంటే రెండు ఆర్డర్ చేస్తారు. అలాగే ఒక భోజనం చేయటం కోసం రెండు మీల్స్ ఆర్డర్ చేస్తారు. ఆ రెండోది ఎవరు అడిగితే వాళ్ళకు ఇస్తారు చాలామంది ఈ సస్పెండెడ్ మీల్స్ కోసం కాఫీ షాపుల్లో ,హోటళ్ళలో వెతుకుతూ ఉంటారు. ఇప్పుడీ కాఫీ దానం అన్ని దేశాలకు విస్తరించింది. ఈ సస్పెండెడ్ కాఫీ కోసం అన్ని దేశాలకు విస్తరించింది. ఈ సస్పెండెడ్ కాఫీ కోసం సామజిక మాధ్యమాల్లో ఎన్నో పేజీలు రూపం పోసుకొన్నాయి ఈ పేజీల్లో సస్పెండెడ్ కాఫీ కోసం ఆర్డర్ చేయవచ్చు అందుకొనే వాళ్ళు అందుకోవచ్చు. ఈ సంప్రదయం అంతటా కొనసాగితే ఎంతో మందికి సాయం.