జల్లి కీర్తి అసోమ్ లోని హైలకండి జిల్లా డిప్యూటీ కమీషనర్ గా పనిచేస్తుంటారు .తెలంగాణలోని జనగామ జిల్లా తరిగొప్పలంకు చెందిన కీర్తి విజయవంతంగా పూర్తి చేసిన ఒక టాస్క్ .రాష్ట్రానికే స్టాండర్ ఆఫ్ ప్రొసిజర్ గా మారింది .సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన ఒక వ్యక్తి క్వారంటైన్ లో ఉండి మృతి చెందాడు .అతని మృతదేహాన్ని రాష్ట్ర మంత్రి సహకారంతో అప్పటికే క్వారంటైన్ లో ఉన్న అతని కుటుంబ సభ్యులకు చూపించి కర్మకాండలు జరిపించి మరీ ఖననం చేయించారు కీర్తి .ఈ కరోనా సమయంలో ఎంతో మంది సాయంతో ఒక ఆరు గంటల పాటు శ్రమపడితే ఈ పని పూర్తి అయింది .జల్లి కీర్తి మృతుని విషయంలో తీసుకొన్న శ్రద్దాభక్తులు అతని కుటుంబం పట్ల చూపించిన సానుభూతి అప్పటికప్పుడు అంత్యక్రియలు పూర్తి చేయించిన విధానం ఆ రాష్ట్రానికే ఒక నమూనాగా తయారయింది .కష్ట కాలంలో ఎవరి విషయంలో అయినా ఇలాగే ప్రవర్తించాలని దాన్ని ఒక స్టాండర్డ్ ఆఫ్ ప్రోసిజర్ గా మార్చారు .ఈ జిల్లాకు తొలి మహిళా అధికారిగా వచ్చింది జల్లి కీర్తి .

Leave a comment