Categories
ఈ మధ్యకాలంలో కరోనా జాగ్రత్తలలో భాగంగా ఎంతోమంది మల్టీ విటమిన్,విటమిన్-సి, జింక్ టాబ్లెట్లు తీసుకుంటున్నారు.అయితే ఏదైనా పోషకాహార లోపం ఉంటే తప్ప అధిక మోతాదులో ఈ విటమిన్లు సప్లిమెంట్ల వల్ల ఉపయోగం లేదనే అంటున్నారు డాక్టర్లు.కషాయాలు టాబ్లెట్ల కంటే ఆరోగ్యకరమైన జీవనశైలి ఉంటేనే రోగ నిరోధక వ్యవస్థ బాగా పని చేస్తుందని చెపుతున్నారు.ప్రొటీన్లు అధికంగా ఉండే మాంసం, గుడ్లు, పప్పులు, గింజలు, విటమిన్ సి ఉండే తాజా పండ్లు పచ్చి కూరలు అల్లం వెల్లుల్లి ధనియాలు పసుపు వంటి దినుసులు ఇమ్యూనిటీకి సహకరిస్తాయి.ఫాస్ట్ ఫుడ్స్,తీయని పదార్థాలు తగ్గించి వీలైనన్ని తాజా కాయగూరలే తీసుకోవాలి.
|