Categories
మేకప్ తొలగిచేందుకు మేకప్ రిమూవర్స్ కంటే బేబీ ఆయిల్ చక్కగా పనిచేస్తుంది. పేరుకు పిల్లలకోసం అని ఉంటుంది కానీ దీనీ వల్ల చర్మానికి చక్కని తేమ ఉండి ఆరోగ్యంగా అయిపోతుంది అంటారు మేకప్ ఎక్స్ పర్ట్స్. వాకింగ్ తర్వాత దద్దుర్లు రాకుండా ఉండాలంటే కాస్త ఈ ఆయిల్ తో మృదువుగా రాస్తే సరిపోతుంది. చర్మానికి స్వాంతన కలుగుతుంది. కంటి కింద వలయాలకు బేబీ ఆయిల్ చక్కని మందు. ప్రతి రోజూ ఈ ఆయిల్ తో కళ్ళ కింద చర్మానికి మర్ధన చేస్తే అక్కడ రక్త ప్రసరణ జరిగి వలయాలు మాయమ్ అవుతాయి. చల్ల గాలికి మొహం పెదవులు పగిలితే తేలికైన బేబీ ఆయిల్ మంచి ఉపశమనం . స్నానం చేశాకా శరీరం తడిగా ఉండగానే ఈ ఆయిల్ రాసుకంటే చర్మం మెరుపుతో ఉంటుంది.