ఈ రోజుల్లో 30 ఏళ్ళు దాటుతుండగానే జుట్టు తెల్లబడి పోతోంది. జుట్టు మాడు పైన రాలి పల్చగా అయిపోతోంది. ఈ తెల్లజుట్టుకు పెద్ద ఉసిరికాయలు చాలా  మంచి వైద్యం. ఈ ఉసిరికాయ గుజ్జును క్రమం తప్పకుండా వెంటుకల చివర్లలో రుద్దుతూ ఉంటే తెలుపు నలుపు అయిపోతుందని ఆయుర్వేదం గ్యారెంటీ ఇస్తోంది. మాడుపైన బాగా రుద్దాలి. అలాగే స్వచ్ఛమైన కొబ్బరినూనె  నిమ్మకాయ కలిపి బాగా మర్దనా చేయాలి. శీకాయ కుంకుళ్ళు రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే ఆ గుజ్జుకు నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చల్లారిన తర్వాత వడకట్టి గుజ్జును తొలగించి షాంపూ మాదిరిగా ప్రతిరోజూ వాడాలి. అయితే ఈ గుజ్జును ఎప్పటికప్పుడు తీసి మరిగించటం చేయాలి. షాంపూ మాదిరిగా ఇది నిల్వవుండేది కాదు. నిల్వవుండే ఏ రసాయనాలు కలపకుండా స్వచంగా ఉండే రసం ఇది. ఆముదం నిమ్మరసం బాగా కలిపి నురగ వచ్చే వరకు గిలకొట్టాలి. దానికి హెన్నా కలిపి మాడుకు పట్టించి గంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. మునివేళ్ళతో మాడుకు మసాజ్ చేయటం చాలా  మంచిది. ఇలా వెంట్రుకలకు తగిన పోషణ ఇస్తే జుట్టు రాలిపోకుండా వుంటుంది.

Leave a comment