ఒక చక్కని కథ ఉంది.ఒక మనిషిని సింహం తరుముకుంటూ వస్తుంది.అతను పరిగెడుతూ ఒక పాడుబడిన బావి లోకి జారి పోతూ చేతికి అందిన ఒక బలమైన వేరు అందుకొన్నాడు.అది మర్రి చెట్టు వేరు బావిలోకి వంగిన ఆ మర్రి కొమ్మ మీద ఒక విషసర్పం విష సర్పం నాలుక జాపుపోతోంది మనిషి బరువుకు కొమ్మ జారిపోతోంది. తలెత్తిన ఆ మనిషి నోట్లో కి ఒక తేనె చుక్క రాలి పడింది.ఎత్తుగా ఉన్న ఆ చెట్టు కొమ్మ పైన తేనెతుట్టె నుంచి తేనె రాలుతోంది.దాన్ని ఆ మనిషి నాలుకతో అందుకుంటూ ఉన్నాడు అలాంటి విపత్కర  పరిస్థితిలో కూడా. విజ్ఞానులు దాన్ని ఎలా నిర్వచిస్తున్నారు అంటే తరుముకు వచ్చే సింహం మృత్యువు విష సర్పం వార్ధక్యం రోగం ఈ మధ్యని నోటికి అందిన తేనె జీవితపు కాంక్ష మనిషి జీవితం ఇదే. మృత్యువు తప్పదని తెలిసి వృద్ధాప్యం అనారోగ్యం వెంటాడుతాయి అని తెలిసి ప్రాణం పైన తియ్యదనాన్ని మాత్రమే రుచి చూస్తూ ఉంటాడని.ఈ కథని దృష్టిలో ఉంచుకుని జీవితాన్ని సద్వినియోగం చేసుకోమంటారు పెద్దవాళ్ళు.

చేబ్రోలు శ్యామసుందర్
9849524134

Leave a comment