రోజూ స్నానం ,చక్కని భోజనం సరదాగా విహారం ,ఈ ఉపచారాలన్నీ వీధి కుక్కలకు . పెంపుడు జంతువుల్లా సకల భోగాలు అనుభవిస్తున్నాయి. ఈ వీధి కుక్కల స్వర్గం అమెరికాలో ఉంది . కోస్టారికాలో టెరిటో రియో ఓ జాగ్వట్స్ ప్రాంతంలో 900 పైగా వీధి కుక్కలు ఉంటాయి . ఈ ప్రాంతాన్ని లాండ్ ఆఫ్ స్ట్రే డాగ్స్ ,డాగ్స్ హెవెన్ అంటారు . వందలాది జాతులకు చెందిన వీధికుక్కలుంటాయి ఇక్కడ . అల్వరో సామెట్ .లియా బాటిల్ అనే భార్య భర్తలు ,మొదటిగా వీధికుక్కలు చేరదీశారు . నెమ్మదిగా స్థానికులు కూడా ఇందులో భాగం పంచుకొన్నారు .