Categories
అతి అనర్ధ దాయకమే …. ఏ పనికి అయినా కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి . బరువు తగ్గిపోవాలనో ,ఆరోగ్యం కోసమనో మితిమీరిన వ్యాయామాలు చేస్తే ఆరోగ్యం బదులు అనర్దాలు ఎదురవుతాయి . రోజూ ఓ గంట లేదా అంతకంటే కాస్త ఎక్కువ సమయం వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది . వ్యాయామం పేరుతో శరీరానికి తీవ్ర శ్రమకు గురిచేస్తే దుష్ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులు . పరుగు,ఈత సైక్లింగ్ వంటి ఏరోబిక్స్ చేసే సమయంలో త్వరగా అలసిపోతూ ఉందా శరీరం అధిక శ్రమకు గురవుతోందని గ్రహించాలి . వారానికి ఏడున్నర గంటలు మించి వ్యాయామం చేస్తే గందరగోళం ,చిరాకు ,కుంగుబాటు ,విసుగు,కోపం వంటి ప్రతికూల భావాలు పెరిగి ఒత్తిడికి గురవుతారని అధ్యయనాలు చెపుతున్నాయి .