స్కై ఫ్యాక్టరీ (ఇ -స్కేప్ వర్చువల్ విండో ) అదర్ వ్యూ వంటి కంపెనీలు తయారు చేసే డిజిటల్ కిటికీలు అమర్చుకొంటే ఇంట్లో గంటల తరబడి బయటికి కదలకుండా కూర్చుంటూ,బయట ప్రకృతి కనబడదు అని దిగులు పడేవాళ్ళకి ఊరటగా ఉంటుంది. ఈ కిటికీలకు టివి తెర వంటి ఎల్ ఇడీ స్క్రీన్ ఉంటుంది. ఈ తెర పైన ప్రదర్శించే రకరకాల వీడియోలు కంపెనీలు అత్యధికమైన డిజిటల్ సినిమా కెమెరాలతో చిత్రీకరిస్తారు. వీటి నిడివి,అరగంట నుంచి 24 గంటలూ ఉంటుంది. సముద్రం,జలపాతాలు వన్యమృగాలు,అరణ్యం దృశ్యాలు పచ్చని చెట్లు నీటి కొలనులు అన్ని కనిపిస్తాయి. ఈ డిజిటల్ వర్చువల్ విండో లోంచి రమణీయమైన ప్రకృతిని చూసి ఆనందిస్తూ ఉండచ్చు.

Leave a comment