మలయాళ సినిమా గ్రేట్ ఇండియన్ కిచెన్  OTT ప్లాట్ ఫామ్ ద్వారా విడుదలైంది దర్శకుడు జియో బేబీ. నిమిష సజయన్, సూరజ్  వెంజర మూడు  ఇందులో నటించారు చదువుకున్న అమ్మాయి డాన్సర్ పెద్దలు కుదిర్చిన ఇష్టపడిన పెళ్లి చేసుకుంటుంది. అత్తగారింట్లో అత్తగారు, మామగారు భర్తతో కాపురం మొదలవుతుంది. ఎప్పుడూ తిరగలి లాగా తిరుగుతూ అందరికీ పనులు చేసే పెట్టె అత్తగారి వెనకే వంటగదిలోకి వస్తుంది. అమ్మాయి మామ   గారికి భర్తకి తలకో రుచి. అత్తగారు కూతురి ప్రసవం కోసం ఊరు వెళుతుంది. కోడలు వంట బాధ్యత తీసుకుంటుంది. టేబుల్ మానర్స్ కూడా పాటించని భర్తకు అనుకువ గా ఉంటుంది. కలలో కూడా, శృంగారంలో కూల్ ఆమె ఇంట్లో అంట్లు, భర్త కంచం చుట్టూ వదిలేసిన తొక్కలు గుర్తొస్తాయి. ఒక్క సాయం కూడా దొరక్క, ఒక  మెచ్చు కోట కూడా ఎవళ్ళూ  ఇవ్వక విసిగి పోయిన అమ్మాయి ఇంట్లో నుంచి బయటికి వస్తుంది. వంట పని పైన వ్యతిరేకత కాదు ఈ సినిమా ఉద్దేశం వంట కు సంబంధించి శ్రమ విభజన మానవీయత అవసరం గురించి మాట్లాడుతుందీ సినిమా.

Leave a comment