Categories
కోవిడ్ కారణంగా కుటుంబం మొత్తం ఇంట్లోనే ఉండవలసి వస్తోంది.ముఖ్యంగా పిల్లలు ఆన్ లైన్ తరగతులకు హాజరు కావటం టీవీల ముందు కూర్చోవటం ఎక్కువయింది. సమయానికి స్కూల్ లకు వెళ్ళినట్లుగా క్రమశిక్షణగా తినటం లేదు.ఇది వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీస్తోంది. అల్పాహారంగా అటుకులతో చేసిన పోహ, ఇడ్లీ, దోశ వంటివి ఇవ్వాలి ఇందులో సీజనల్ పండ్లు చేర్చాలి అలాగే తాజా పండ్ల తో మిల్క్ షేక్ లు ఇవ్వచ్చు. మధ్యాహ్నపు భోజనంలో తాజా కూరగాయలు పప్పు, చిక్కుడు, బీన్స్, ఆకుకూరలు ఉండాలి ఉడకబెట్టిన రాజ్మా, శనగలు ఏదో ఒక సమయంలో స్నాక్స్ లాగా ఇవ్వాలి విటమిన్ బి12 ఐరన్ పుష్కలంగా ఉండే పెరుగు, ఎండుద్రాక్షలు తప్పనిసరిగా పిల్లలకు తినిపించాలి. పాలు అరటిపండ్లు మిల్క్ షేక్ లు పోషక విలువలతో కూడిన ఆహారం ఇవ్వాలి.