Categories
జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే పోషణ చేయాలి ఎందుకు కొబ్బరిపాలు వాడటం శ్రేష్టం.కొబ్బరి లో ఉండే ప్రోటీన్, విటమిన్లు,వెంట్రుకలు,మాడుని ఆరోగ్యంగా ఉంచుతాయి అర గ్లాస్ కొబ్బరి పాలు పావు కప్పు కలబంద గుజ్జు కలపాలి దీన్ని జుట్టుకు పట్టించి ఓ గంట ఆరనిచ్చి తలస్నానం చేస్తే తలకు తేమ అందుతుంది. అలాగే కప్పు మునగాకు పేస్టులో పావు కప్పు కొబ్బరి పాలు చెంచా ఆలివ్ నూనె కలిపి తలకు పట్టించి తలస్నానం చేస్తే జుట్టు మెరిసిపోతోంది. అలాగే కొబ్బరి పాలలో రెండు మూడు స్పూన్ల మెంతులు నాననిచ్చి మెత్తగా రుబ్బి గుడ్డు తెల్లసొన చేర్చి తలకు పెట్టుకుంటే చుండ్రు దగ్గరకు రాదు.