ఎంతో చక్కని ఫేస్ ప్యాక్ లు ఆయా సీజన్ లలో దొరికే అన్ని రకాల పండ్లు ,పూలతో తయారు చేసుకోవచ్చు . పుచ్చకాయరసం,కమలా పండు రసం,మామిడి పండు దోసకాయ గుజ్జు దేనితో అయిన మొహానికి మసాజ్ చేసుకోవచ్చు, జిడ్డు చర్మం గలవారు పుల్లటి పండ్లు వాడాలి, సాధారణ చర్మం అయితే దోస అరటి పండ్లు వాడాలి అలాగే బంతి చామంతి గులాబీ పూలు అన్ని వయసుల వారు వాడచ్చు. చామంతి పూలు టీనేజ్ దాటినా తర్వాత వాడాలి. అయితే తాజా పూలు అన్ని కలల్లో దొరకవు కాబట్టి ఈ రెక్కలు ఎండ బెట్టి పొడి చేసి నిల్వ చేసుకోవచ్చు పాలు,నీళ్ళు,పెరుగు తో ఆ ఎండిన పులా పొడి కలిపి ప్యాక్ వేసుకొంటే బావుంటుంది. ఇది రసాయనాలు కలపని ప్యాక్ గనుక ఎప్పుడు ఆరోగ్యమే .

Leave a comment