మనం కొన్ని రకాల పదార్దాలు ఇష్టపడితే చైనీయులు,జపనీయులు ఇంకో రకానికి ప్రాధాన్యత ఇస్తారు. జపనీయులు ఆహారంలో ఎక్కువ ఆకుకూరలు క్యాబేజి,ఉల్లికాడల వంటివి తీసుకొంటారు,చాలా తక్కువ మొత్తంలో పిండి పదార్దాలుంటాయి .సుగంధద్రవ్యాలు గ్రీన్ టి వాడకం ఎక్కువే వీటన్నింటి వల్ల యాంటీ ఆక్సిడెంట్లే కాదు విటమిన్లు ఖనిజాలు అందుతాయి. గ్రీకులు ఆలివ్ నూనె వాడటంలో ముందుంటారు కొరియన్లు జపాన్ వాళ్ళలాగే కూరగాయలు ఎక్కువ తీసుకొంటారు. ముల్లంగి క్యాబేజీ అల్లం తో చేసే కిమ్చి అనే వంటకాన్ని ఇష్టంగా తింటారు చైనా వాళ్ళు . బిన్స్,సోయాగింజలు,అన్నం డార్క్ సోయాసాస్,వెల్లుల్లి అల్లం నువ్వులనూనె ఎక్కువగా వాడుతారు. ఇవన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేవే. వెల్లుల్లి అల్లంతో దగ్గు,జలుబు వంటివి రావు. అందుకే ఇతర దేశాల్లో ఆరోగ్యంగా ఉండేందుకు ఏం తింటారో తెలుసుకొని అవన్ని భోజనంలో భాగంగా చేసుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్.
Categories