నాకీ పోటీల గురించి తెలియదు. మా ఇంటి నుంచి పొలానికి మూడు కిలోమీటర్ల దూరం చెప్పులు లేకుండానే నడుస్తూ ఉంటాను సరే చూద్దాం, గెలిస్తే వచ్చే లక్ష రూపాయలతో కనీసం పిల్లల్ని చదివించుకోవచ్చు అనుకొన్నా అంటుంది మల్లం రమా మహిళల్లో ఫిట్ నెస్ పై అవగాహన తెచ్చేందుకు హుస్నాబాద్ పోలీస్ శాఖ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని 30 ఏళ్లు పైబడిన మహిళల కోసం 5 కే రన్ పెట్టింది. సిద్దిపేట జిల్లా మల్లం పల్లి కి చెందిన రమ పొలం పనులు చేస్తుంది. చుట్టుపక్కల మండలాల నుంచి 500 మందికి పైగా మహిళలు సాధన చేసి పోటీలకు వచ్చారు. పొలం పనులకు వేసుకునే పాత చొక్కా వేసుకుని చెప్పులు లేకుండా పరిగెత్తి రమా పోటిల్లో గెలిచింది 26.24 నిమిషాల్లో 5 కిలోమీటర్లు పరిగెత్తి గమ్యాన్ని చేరుకొని బహుమతి సాధించింది.
Categories