జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని సువిశాల ప్రాంతం లడక్ జనాభా తక్కువ విస్తీర్ణం ఎక్కువ బౌద్ధం ప్రధాన మతం.లడక్ లోని పువ్వుల లోయలు చూస్తుంటే ప్రపంచంలోని అందమంతా ఇక్కడే ఉందని అనిపిస్తుంది. లడక్ లోని షీలా కాంగ్ ప్రాంతంలోని లోయ ఒక ప్రత్యేకం సముద్రమట్టానికి 5,000 అడుగుల ఎత్తైన చుట్టూ మంచు పర్వతాలు కరిగిన నీళ్ళతో ఏర్పడిన సెలయేళ్ళు. ఆ సెలయేళ్లు అంచున ఎన్నో రంగురంగుల పువ్వులు ఒక పువ్వు కి ఒక ప్రత్యేకమైన అందం నీలి, గులాబీ, పసుపు, తెలుపు, ఉదా రంగు లో ఎన్నో రకాల పువ్వులు తివాచీలు పరచినట్లుగా ఉంటుందీ లోయ.ఈ లోయ సమీపంలో జన సంచారం పెద్దగా ఉండదు. ప్రత్యేకంగా వెతుకుతూ వెళ్లాలి. ఈ లోయ అందాన్ని చూసేందుకు వెళ్లే టూరిస్ట్ లు ఇక్కడ గుడారాలు వేసుకొని ఉంటారు. ఇంకా ఇతర సౌకర్యాలు ఏవీ ఉండవు. కేవలం ప్రకృతిలో మమేకమై సమయం గడపాలనుకునే వారికి ఎలాంటి విలాసాలు కోరుకొని ప్రకృతి ప్రేమికులకు మాత్రం ఇది అద్భుతమైన ప్రవేశం జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాంతాన్ని చూడాలి అంటారు అక్కడికి వెళ్లి వచ్చిన టూరిస్ట్ లు !
Categories