ముక్కు,నుదురు,చుబుకం పై బ్లాక్ హెడ్స్ వస్తూ ఉంటాయి. ఇంట్లో లభించే పదార్ధాలతో వీటిని తేలికగా తొలిగించవచ్చు ముఖ్యంగా బంగాళదుంప పేస్ట్ చక్కగా పనిచేస్తుంది. ఒక స్పూన్ చొప్పున ఆలు రసం తేనె తీసుకొని ఇందులో పసుపు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాయాలి. ఇలా వారంలో రెండు మూడుసార్లు చేస్తే బ్లాక్ హెడ్స్ పోతాయి. అలాగే పావు చెంచా చొప్పున పసుపు ఉప్పు తీసుకొని కొబ్బరి నూనె కలిపి బ్లాక్ హెడ్స్ పై రుద్దాలి. దీనిలోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు బ్లాక్ హెడ్స్ ను తొలిగిస్తాయి. వంట సోడా లో కాసిని నీళ్లు కలపి ఆ పేస్ట్ ని రాసిన సరే బ్లాక్ హెడ్స్ పోతాయి.

Leave a comment