మంచు కొండల్లో అతి చల్లని వాతావరణంలో ఉంటుంది లద్దాక్. అక్కడి కొండలు, విశాలమైన మైదానాలు చూపిస్తూ ఈ ప్రకృతి ఒడే నా ఇల్లు అన్నాడు అక్కడే పెద్ద మనిషి. సముద్రం నుంచి 3500 మీటర్ల ఎత్తులో ఉన్న లద్దాక్ పర్వతాలలోని మారుమూల గ్రామం లోని ఒక యువ గ్రాఫిక్ డిజైనర్ జీవితాన్ని డాక్యుమెంటరీ గా నిర్మించాను. అక్కడి ఎన్నో కుటుంబాల జీవన శైలిని ప్రతిబింబించే ఈ డాక్యుమెంటరీ దిస్ ఈజ్ మై హోమ్.ఈ ఏడాది ముంబై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకు వచ్చిన 800 ఎంట్రీ లలో టాప్ టెన్ జాబితాలో ఉంది అంటున్నారు స్టోరీ టెల్లర్. స్టోరీ ఆర్ట్ ఫౌండేషన్ ఫౌండర్ దీపాకిరణ్. ఈ మూవీ చూశాక ఎంతో మంది డైరెక్టర్లు మేము ఆ గ్రామంలో ఉన్నట్లు అక్కడ ఎంతోమందిని కలుసుకున్నట్లు అనిపించింది అన్నారు. ఈ ప్రపంచంలో ఏ మూల లో అయినా ‘దిస్ ఈజ్ మై హోమ్’ అనుకోగలిగే వాతావరణం ఉంటుంది. అదే నా సినిమా కాన్సెప్ట్ అంటుంది దీపాకిరణ్.
Categories