కరోనా వైరస్ వ్యాప్తిని నోటి శుభ్రతతో నివారించవచ్చునంటున్నారు డాక్టర్ సుమన్ కాపుర్. ఇందుకోసం ఆమె ప్రత్యేకంగా ఓ మౌత్ వాష్ తయారు చేశారు. బిర్లా ఇన్స్ ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ హైద్రాబాద్ కాంపస్ లో బయో కెమిస్ట్రీ విభాగంలో ఆమె సీనియర్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. కరోనా బాధితులు తుమ్మినా దగ్గినా వచ్చే తుంపరులు ఎదుటి వ్యక్తిపై పడినప్పుడు ఆ వైరస్ ఆ తుంపరల నుంచి ఎదుటి వ్యక్తి కి చేరి వాళ్ళ గొంతులో 24 గంటల వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో నోటి ద్వారా వెళ్ళే వైరస్ ను ముందుగానే నిరోధించవచ్చు అంటున్నారు డాక్టర్ సుమన్ లాలాజలంతో దంతాల వెనక గొంతులో చేరే బాక్టీరియా ను ఈ మౌత్ వాష్ నాశనం చేసిందని తేలిందని చెప్పారు. సహజమైన మూలికలు మొక్కల నుంచే ఈ మౌత్ వాష్ ను తయారు చేశారు. ఇంకా దీనికి ప్రభుత్వ అనుమతి రావలసి ఉంది.
Categories