కాస్త ప్రత్యేకంగా కనిపించాలి అంటే ప్యాచ్ వర్క్ శారీస్ ఎంచుకోండి అంటున్నారు డిజైనర్స్. అందమైన డిజైన్ లతో ప్యాచ్ వర్క్ చేసిన కాటన్ చీరెలు చక్కగా ఉంటాయి. పువ్వుల లతల డిజైన్ తో ఉన్న కాంట్రాస్ట్ కలర్ ప్యాచ్ ను సాదా చీర కు అటాచ్ చేస్తే ఈ ప్యాచ్ వర్క్ తో ఆ చీరె అందం మారిపోతోంది. ప్యాచ్ వర్క్ కు వాడిన క్లాత్ నే బ్లౌజుకు వాడితే చీరెకు అందం వస్తుంది. నెక్ డిజైన్ చూసి ఎంచుకోవాలి రౌండ్ షేప్ నెక్ డిజైన్లు చక్కగా ఉంటాయి. సొంతంగా డిజైన్ చేయించుకొనేప్పుడు చీరె కలర్ కు ప్యాచ్ వర్క్ చేస్తే క్లాత్ సరిగ్గా మ్యాచ్ అయితే నలుగురి కళ్ళను ఆకర్షిస్తుంది.

Leave a comment